Belgaum student: దయచేసి పాస్ చేయండి.. ప్రేమను బతికించండి.. జవాబు పత్రంలో పదో తరగతి విద్యార్థి అభ్యర్థన

Please Pass Me Save My Love 10th Graders Plea in Answer Sheet
            
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్‌పై తన ప్రేమ గురించి రాసి.. తనను ఎలాగైనా పాస్ చేయాలని, అప్పుడే తన ప్రేమ నిలుస్తుందని రాసుకొచ్చాడు. మూల్యాంకనం చేస్తున్న క్రమంలో చూసిన ఉపాధ్యాయుడు అది చూసి షాకయ్యారు. 

పదో తరగతి పాస్ అయితేనే తనతో ప్రేమ కొనసాగిస్తానని గాళ్ ఫ్రెండ్ చెప్పిందని జవాబు పత్రంలో రాసిన విద్యార్థి ‘నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. అమ్మాయి ప్రేమ కొనసాగాలంటే నేను పాస్ కావాలి’ అని రాశాడు. దయచేసి తనను పాస్ చేయాలని కోరుతూ ఆన్సర్ షీట్ మధ్యలో రూ. 500 పెట్టాడు. ఈ డబ్బులతో టీ తాగాలని.. తనను పాస్ చేయాలని అభ్యర్థించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో వైరల్ అయింది.
Belgaum student
Karnataka 10th class exams
Love letter in answer sheet
Viral answer sheet
Student pleads for passing marks
Bribe in exam
Social media viral
India exam news
10th class results

More Telugu News