Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన

Pope Francis Death Chandrababu Naidu Nara Lokesh Express Grief
  • పోప్ ఫ్రాన్సిస్ మృతి దిగ్భ్రాంతిని కలిగించిందన్న చంద్రబాబు, లోకేశ్
  • వినయం, కరుణ, శాంతి సందేశం ద్వారా స్ఫూర్తినిచ్చారన్న చంద్రబాబు
  • తరతరాలకు స్ఫూర్తిగా నిలిచారన్న నారా లోకేశ్
క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వినయం, కరుణ, శాంతి సందేశం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చిన ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం తనకు చాలా బాధ కలిగించిందని చంద్రబాబు 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. మానవాళిని ప్రేమ, దయతో నడిపించారని కొనియాడారు.

శాంతి సందేశం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ప్రపంచ క్యాథలిక్ సమాజానికి తన సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఆధ్యాత్మిక నాయకత్వంలో తరతరాలకు పోప్ ఫ్రాన్సిస్ స్ఫూర్తిగా నిలిచారని నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను స్పృశించారని మంత్రి పేర్కొన్నారు.
Pope Francis
Pope Francis death
Chandrababu Naidu
Nara Lokesh
Andhra Pradesh
Catholic Church
Spiritual Leader
condolences
global impact
religious leader

More Telugu News