PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు అరెస్ట్‌

Former AP Intelligence Chief PSR Anjaneyulu Arrested
  
ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు అరెస్ట్ అయ్యారు. ముంబ‌యి న‌టి జెత్వానీకి వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయ‌న్ను హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆంజ‌నేయులును పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు. దీంతో ఆయ‌న్ను హైద‌రాబాద్ నుంచి ఏపీకి త‌ర‌లిస్తున్నారు. కాగా, గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పీఎస్ఆర్ ఆంజ‌నేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న స‌స్పెన్ష‌న్‌లో ఉన్నారు.  


PSR Anjaneyulu
AP Intelligence Chief
Arrest
CID
Mumbai Actress
Harassment Case
AP CID
YCP Government
Suspension
IPL Official

More Telugu News