Inya Sultana: అమెజాన్ ప్రైమ్ లో ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్!

Natarathnalu Movie Update
  • క్రైమ్ కామెడీగా 'నటరత్నాలు'
  • క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన సినిమా 
  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ 
  • రెంటల్ విధానంలో అందుబాటులోకి 
    
ఇనయా సుల్తానా .. యూత్ లో ఈ పేరుకు మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 6 తో ఈ బ్యూటీ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అప్పటి నుంచి కూడా సినిమాలలో చిన్నచిన్న పాత్రలను వేస్తూ వెళుతోంది. అలా ఆమె చేసిన సినిమానే 'నటరత్నాలు'. క్రితం ఏడాది మే నెలలో థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ తెరపైకి వచ్చేసింది. 

శివనాగు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఇనయా సుల్తానాతో పాటు సుదర్శన్ .. తాగుబోతు రమేష్ .. రంగస్థలం మహేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మర్డర్ మిస్టరీకి కామెడీ టచ్ ఇస్తూ నడిచే కథ ఇది. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయల రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. 

బంగార్రాజుకి సినిమా హీరో కావాలని ఉంటుంది. ఆ దిశగా అతను అడుగు వేయడానికి స్నేహితుల సపోర్టు ఉంటుంది. సువర్ణ కూడా సినిమాలలో హీరోయిన్ కావాలని వస్తుంది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. జీవితాన్ని గురించి కలలు కంటున్న ఈ బృందం, ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటుంది. అందుకు కారకులు ఎవరు? అందులో నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అనేది కథ. 

Inya Sultana
Nataratnalu
Amazon Prime
Crime Thriller
Telugu Movie
OTT Release
Shivanagu
Sudarshan
Tagubotu Ramesh
Rangasthalam Mahesh

More Telugu News