Engineering Student Attacks Lecturer: తన ఫోన్ లాగేసుకుందని లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని... వీడియో ఇదిగో!

Student Beats Lecturer with Slipper Shocking Andhra Pradesh College Video
  • విజయనగరం రఘు ఇంజినీరింగ్ కాలేజీలో ఘటన
  • మహిళా లెక్చరర్ పై విద్యార్థిని బూతు పురాణం
  • నా ఫోన్ తీసుకుంటావా అంటూ చెప్పుతో దాడి
  • సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే  వీడియో!
గురుశిష్య సంబంధానికే మాయని మచ్చ తెచ్చేలా ఓ దారుణ సంఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది. తన సెల్ ఫోన్ తీసుకున్నారన్న కోపంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఏకంగా లెక్చరర్‌పైనే చెప్పుతో దాడికి పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్నం-విజయనగరం జాతీయ రహదారి సమీపంలోని దాకమ్మరి వద్ద గల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి, తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

వివరాల్లోకి వెళితే.. సదరు కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని తరగతి గది/క్యాంపస్ ప్రాంగణంలో సెల్ ఫోన్ వాడుతుండగా లెక్చరర్ గమనించారు. నిబంధనల ప్రకారం లెక్చరర్ ఆ విద్యార్థిని నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర ఆగ్రహానికి లోనైంది. విచక్షణ కోల్పోయి లెక్చరర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా, తన కాలికి ఉన్న చెప్పును తీసి లెక్చరర్‌పై దాడికి దిగడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ అనూహ్య పరిణామంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వెంటనే స్పందించి, దాడి చేస్తున్న విద్యార్థినిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా లెక్చరర్‌పై దాడిని కొనసాగించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వీడియో దర్శనమిస్తోంది.
Engineering Student Attacks Lecturer
Visakhapatnam Violence
Andhra Pradesh News
Viral Video
College Fight
Mobile Phone Seized
Lecturer Assaulted
Student Assault
Raghu Engineering College
Dakamarri

More Telugu News