Pawan Kalyan: 'PPP... పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్' అంటూ శ్యామల ఫైర్

Pawan Kalyan Faces Criticism from Shyamala over Dalit Issues
  • పిఠాపురం నియోజకవర్గంలో దళితులకు సాంఘిక బహిష్కరణ అంటూ వార్తలు
  • పవన్ ఇలాకాలో దళితుల దుస్థితి ఇదీ అంటూ శ్యామల విమర్శలు
  • పవన్ సిగ్గుపడాలి అంటూ వ్యాఖ్యలు
 వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పిఠాపురం నియోజకవర్గంలో  దళితులకు సాంఘిక బహిష్కరణ విధించారన్న వార్తల నేపథ్యంలో శ్యామల స్పందించారు. 

PPP... పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్ మీ ఇలాకా పిఠాపురంలో దళితుల దుస్థితి ఇది... సిగ్గుపడాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

"మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు విద్యుత్ షాక్ తో మరణించాడు. అతడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరినందుకు మొత్తం దళితులను మల్లాం గ్రామస్తులు వెలివేశారు. వారిని పొలం పనులకు పిలవడం లేదు... వారికి పాలు కూడా పోయడం లేదు... దీంతో దళిత కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇదేనా మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం ప్రజలకు న్యాయం చేయడం?" అంటూ శ్యామల ధ్వజమెత్తారు.
Pawan Kalyan
Shyamala
Pithapuram
Andhra Pradesh
Dalit issues
Social boycott
Deputy CM
YSRCP
Electricity death
Mallampalem

More Telugu News