Salathy Boos: బెంగళూరులో వాయుసేన అధికారిపై దాడి ఘటన... మరి సీసీ ఫుటేజి ఇలా ఉందేంటి?

engaluru IAF Officer Assault CCTV Footage Reveals Shocking Truth
  • తనపై కొందరు దాడికి పాల్పడ్డారంటూ ఐఏఎఫ్ అధికారి బోస్ ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో విడుదల 
  • ఘటనా స్థలంలో సీసీ టీవీ పుటేజీ చూసి నిర్ఘాంతపోయిన పోలీసులు
  • బోస్ పైనే కేసు నమోదు చేసిన పోలీసులు
బెంగళూరులో ఓ వైమానిక దళ అధికారి తనపై కొందరు దాడి చేశారంటూ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన సెల్ఫీ వీడియోతో బెడిసి కొట్టాయి. డీఆర్‌డీఓలో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎఫ్ అధికారి సలాధిత్య బోస్, తాను తన భార్యతో కలిసి కారులో విమానాశ్రయానికి వెళుతుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ వీడియో విడుదల చేశారు.

దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా, వాస్తవాలు ఆయన ఆరోపణలకు భిన్నంగా ఉండటంతో విస్మయం చెందారు. ఘటన స్థలంలో నమోదైన సీసీటీవీ దృశ్యాల ప్రకారం, ఐఏఎఫ్ అధికారి బోస్ స్వయంగా విక్రమ్ అనే వ్యక్తిపై దాడి చేసినట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఈ సంఘటనపై నెటిజన్లు సదరు అధికారి ప్రవర్తనను తప్పుబడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ పుటేజీలు న్యాయాన్ని నిలబెట్టడానికి ఆధారమవుతున్నాయని, లేకపోతే అమాయకులు బాధితులుగా మిగిలిపోయేవారని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై కుమార్ అనే వ్యక్తి ఐఏఎఫ్ అధికారి బోస్‌పై ఫిర్యాదు చేయగా, బయ్యప్పనహళ్లి పోలీసులు బోస్‌పై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Salathy Boos
IAF Officer Assault
Bengaluru Air Force Officer
CCTV Footage Viral
Vikram
Kumar
Assault Case
Bengaluru Crime
DRDO Pilot

More Telugu News