Lashkar-e-Taiba: లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి కాల్చివేత

--
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం ఉదయం నుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది. బందిపొరాలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని పేర్కొంది. నిఘా వర్గాల సమాచారంతో బందిపొరాలో తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు కాల్పులకు దిగారని, భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి చనిపోయాడని అధికార వర్గాల సమాచారం. అయితే, ఈ విషయంపై ఆర్మీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.