Apurna Enterprises: శ్రీవారి అన్నప్రసాదానికి రూ.1 కోటి విరాళం ఇచ్చిన హైదరాబాద్ సంస్థ

1 Crore Donation to Tirumalas Anna Prasadam
  • టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు భారీ విరాళం
  • అపర్ణ ఎంటర్ప్రైజెస్ (వెటిరో టైల్స్) దాతృత్వం
  • క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు చెక్కు అందజేత
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు భారీ విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ అపర్ణ ఎంటర్ ప్రైజెస్ (వెటిరో టైల్స్) ఈ ట్రస్ట్ కు రూ. 1 కోటి రూపాయలను విరాళంగా సమర్పించింది.

సంస్థ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రూ. కోటి విరాళానికి సంబంధించిన చెక్కును చైర్మన్ కు అందజేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాదాన్ని అందించే కార్యక్రమంలో తమవంతు సహకారం అందించినట్లు వారు తెలిపారు.

ఈ భారీ విరాళాన్ని స్వీకరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, దాతృత్వానికి ముందుకు వచ్చిన అపర్ణ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. దాత కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అన్నప్రసాదం వంటి కీలకమైన కార్యక్రమానికి విరాళం అందించడం ప్రశంసనీయమని చైర్మన్ పేర్కొన్నారు.
Apurna Enterprises
Tirumala Tirupati Devasthanams
TTD
SV Anna Prasadam Trust
B.R. Naidu
Hyderabad
Donation
Charity
Venkateswara Swamy
Andhra Pradesh

More Telugu News