BJP: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్ఎస్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

BJP Files Complaint Against BRS in Hyderabad MLC Elections
  • రెండు రోజుల క్రితం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఎన్నికలను బహిష్కరించిన బీఆర్ఎస్
  • పోలింగ్‌లో బీఆర్ఎస్ పాల్గొనలేదని బీజేపీ ఫిర్యాదు
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పై... బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనకుండా బహిష్కరించిందని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలకు దూరంగా ఉండి, పరోక్షంగా మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలని చూస్తోందని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. దీంతో మజ్లిస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

ఈ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ 63 ఓట్లతో గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఇలాంటి పోటీ జరగడం గమనార్హం. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 112 మంది సభ్యులు ఓటర్లుగా ఉన్నారు.

మజ్లిస్ పార్టీకి 49 ఓట్లు ఉండగా, ఇతర పార్టీల మద్దతు లభించింది. మొత్తం ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య తొమ్మిది చొప్పున ఉండగా, కాంగ్రెస్ పార్టీకి ఏడు, బీజేపీకి ఆరు ఉన్నాయి.
BJP
BRS
Hyderabad MLC Elections
Telangana Elections
Majlis Party
Mirza Riyaz Ul Hasan
Gautam Rao
Election Commission Complaint
Hyderabad Local Body Elections
Political Parties in Telangana

More Telugu News