Kishore Dattapuram: హెచ్-1బీ నకిలీ వీసా స్కాం.. భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష

14 Month Jail Sentence for Indian National in H1B Visa Scam
  • అమెరికాలో హెచ్‌-1బీ వీసా మోసం కేసులో తీర్పు
  • భారత సంతతి కిశోర్ దత్తాపురంకు 14 నెలల జైలు శిక్ష
  • నకిలీ ఉద్యోగాల పేరిట వీసాలకు దరఖాస్తులు
  • టెక్‌ నిపుణుల కోసం అక్రమంగా వీసాలు పొందిన వైనం
అమెరికాలో హెచ్‌-1బీ వీసాల మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన కిశోర్ దత్తాపురం (55) అనే వ్యక్తికి అక్కడి న్యాయస్థానం 14 నెలల జైలు శిక్ష విధించింది. నకిలీ పత్రాల ద్వారా విదేశీ నిపుణుల కోసం వీసాలు పొంది మోసానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఈ శిక్ష ఖరారు చేశారు.

వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న 'నానోసెమాంటిక్స్' అనే సంస్థ సహ వ్యవస్థాపకుడైన కిశోర్ దత్తాపురం, తన సహచరులతో కలిసి హెచ్‌-1బీ వీసాల కోసం తప్పుడు దరఖాస్తులు సమర్పించారు. తమ సంస్థలో విదేశీ నిపుణుల కోసం ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని, వాటి కోసం వీసాలు మంజూరు చేయాలని వారు దరఖాస్తుల్లో పేర్కొన్నారు. అయితే, వాస్తవానికి ఆ సమయంలో ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో లేవని విచారణలో తేలింది. కేవలం వీసాలు ముందుగా పొంది, ఆ తర్వాత టెక్ నిపుణులను టెక్ కంపెనీలకు సరఫరా చేసి కమీషన్లు పొందడమే లక్ష్యంగా ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

ఈ విధంగా, అసలు ఉద్యోగాలు ఖరారు కాకముందే వీసాలు సంపాదించడం ద్వారా ఇతర కంపెనీలతో పోటీలో ప్రయోజనం పొందాలని కిశోర్, అతని సంస్థ ప్రయత్నించినట్లు తేలింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా మరో మూడేళ్ల పాటు అతను అధికారుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Kishore Dattapuram
H-1B Visa Scam
H-1B Visa Fraud
India
USA
California
Nanosomantics
14-month Jail Sentence
Immigration Fraud
Tech Workers

More Telugu News