JD Vance: జేడీ వాన్స్ కుటుంబం తాజ్ మహల్ ముందు తీసుకున్న ఫొటోపై మస్క్ కామెంట్

JD Vances Taj Mahal Visit Musk Comments on Family Photo
  • భారత్ లో నాలుగు రోజుల పాటు పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు
  • కుటుంబ సమేతంగా చారిత్రక కట్టడం తాజ్ మహల్ సందర్శన
  • సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన వైనం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తన నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చారిత్రక కట్టడం తాజ్ మహల్‌ను కుటుంబసమేతంగా సందర్శించారు. ఆగ్రాలోని ఈ అద్భుత కట్టడం వద్ద ఆయన తన భార్య ఉష, ముగ్గురు పిల్లలతో కలిసి ఆహ్లాదంగా గడిపారు.

ఈ పర్యటన అనంతరం వాన్స్ తన అనుభూతిని 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. కుటుంబంతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, "ఈరోజు ఉష, పిల్లలతో కలిసి తాజ్ మహల్ సందర్శించాను. ఇది ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. అక్కడ మాకు లభించిన ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. ఆయన పోస్ట్‌కు టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందిస్తూ, "ప్రపంచంలోని అత్యంత అందమైన అద్భుతాల్లో ఇది ఒకటి" అని వ్యాఖ్యానించారు. 

వాన్స్ కుటుంబం సుమారు గంటపాటు తాజ్ మహల్ ప్రాంగణంలో గడిపి, దాని నిర్మాణ శైలిని, అందాలను ఆస్వాదించారు. అంతేకాకుండా, తాజ్ మహల్‌లోని విజిటర్స్ డైరీలో వాన్స్ తన అభిప్రాయాన్ని నమోదు చేశారు. తాజ్‌ను 'అద్భుతం' అని అభివర్ణించిన ఆయన, "నిజమైన ప్రేమకు, మానవ మేధస్సుకు ఇది నిదర్శనం, గొప్ప దేశమైన భారతదేశానికి నివాళి" అని రాశారు. 
JD Vance
Taj Mahal
Elon Musk
US Vice President
India Visit
Agra
Family Trip
Historical Monument
X Post
Tourism

More Telugu News