Sunrisers Hyderabad: చెపాక్ లో సన్ రైజర్స్ ముందు ఈజీ టార్గెట్

Sunrisers Hyderabads Easy Target at Chepauk
  • చెన్నైలో సన్ రైజర్స్ × సీఎస్కే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • హర్షల్ పటేల్ కు 4 వికెట్లు
  • 19.5 ఓవర్లలో 154 పరుగులకు సీఎస్కే ఆలౌట్
ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇకపై ఆడే ప్రతి గేమ్ లో తప్పక గెలవాల్సిన స్థితిలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచారు. ఇవాళ చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ను 154 పరుగులకే పరిమితం చేశారు. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా... ఆ నిర్ణయాన్ని బౌలర్లు నిలబెట్టారు. 

హర్షల్ పటేల్ తెలివైన బౌలింగ్ తో 4 వికెట్లు సాధించగా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2, జయదేవ్ ఉనద్కట్ 2, మహ్మద్ షమీ 1, కమిందు మెండిస్ 1 వికెట్ తీశారు. సన్ రైజర్స్ బౌలర్ల ప్రతిభకు మెరుగైన ఫీల్డింగ్ కూడా తోడైంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. 

ఆ జట్టులో యంగ్ బ్యాట్స్ మన్ డివాల్డ్ బ్రెవిస్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడి స్కోరులో 1 ఫోర్, 4 సిక్సులున్నాయి. మాంచి ఊపుమీదున్న బ్రెవిస్... హర్షల్ పటేల్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద కమిందు మెండిస్ ఒక స్టన్నింగ్ డైవ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. 

ఓపెనర్ గా దిగిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ (0) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. షమీ బౌలింగ్ లో ఇన్నింగ్స్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే 30, శామ్ కరన్ 9, రవీంద్ర జడేజా 21, శివమ్ దూబే 12 పరుగులు చేశారు. ఆఖర్లో దీపక్ హుడా (22) కాస్త ధాటిగా ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 150 మార్కు దాటింది. 

కెప్టెన్ ధోనీ 10 బంతుల్లో 6 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. హర్షల్ పటేల్ విసిరిన చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీని భారీ షాట్ కొట్టబోయి పాయింట్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు.
Sunrisers Hyderabad
Chennai Super Kings
IPL 2023
Chepauk Stadium
Harshal Patel
Pat Cummins
Jaydev Unadkat
Mohammad Shami
Kaming Mendis
Deepak Hooda

More Telugu News