Mohammad Fayaz: హైదరాబాద్‌ పోలీసుల అదుపులో పాకిస్తానీ యువకుడు

Pakistani Man Arrested in Hyderabad
  • పహల్గామ్ దాడి తర్వాత పాక్ పౌరుల వీసాలు రద్దు చేసిన భారత్
  • హైదరాబాద్‌లో ముమ్మర తనిఖీలు చేపట్టిన తెలంగాణ పోలీసులు
  • పోలీసుల అదుపులో పాతబస్తీ యువతిని పెళ్లాడిన పాక్ జాతీయుడు మహమ్మద్ ఫయాజ్
  • భార్యను కలిసేందుకు నేపాల్ మీదుగా నగరానికి వచ్చినట్లు గుర్తింపు
  • విచారణ అనంతరం పాక్‌కు పంపిస్తామని పోలీసులు వెల్లడి
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం పాకిస్తాన్ పౌరుల విషయంలో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. పాక్ పౌరుల వీసాలను రద్దు చేయడంతో పాటు, దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సోదాల్లో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అదుపులోకి తీసుకున్న వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ ఫయాజ్‌గా గుర్తించారు. ఇతను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని, ఇటీవలే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది.

తన భార్యను కలిసేందుకే ఫయాజ్ పాకిస్థా‌న్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఫయాజ్‌ను అదుపులోకి తీసుకుని, అతని ప్రయాణ వివరాలు, ఇతర సంబంధాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత అతడిని పాకిస్థాన్‌కు తిరిగి పంపిస్తామని నగర పోలీసులు వెల్లడించారు.
Mohammad Fayaz
Pakistani national arrested
Hyderabad arrest
Pakistan
India-Pakistan relations
Visa cancellation
Telangana Police
Post-Pulwama crackdown
Dubai
Hyderabad Old City

More Telugu News