Pakistan Army: పాక్ సైన్యానికి బలూచిస్తాన్‌లో ఎదురుదెబ్బ

Baluchistan Major Setback for Pakistan Army
  • బలూచిస్తాన్‌లో శుక్రవారం శక్తివంతమైన పేలుడు
  • ఏడుగురు పాక్ సైనికులు హతం
  • దాడికి పాల్పడింది తామే అని ప్రకటించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 
  • పాక్ సైనికుల చర్యలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్ వ్యాప్తంగా బలూచి యాక్టెహ్తి కమిటీ (బీవైసీ) పిలుపుతో భారీ నిరసనలు
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బలూచిస్థాన్‌లో పాక్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్థాన్‌లో శుక్రవారం జరిగిన శక్తివంతమైన పేలుడులో ఏడుగురు పాక్ సైనికులు హతమయ్యారు. రోడ్డు పక్కన బాంబు పేలడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు.

బలూచ్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామే అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచిస్థాన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బలూచ్ ప్రజలు ఇప్పటికే తమకు స్వాతంత్ర్యం కావాలని నినదిస్తూ పాక్ సైనికులు, అధికారులే లక్ష్యంగా బీఎల్ఏ దాడులకు పాల్పడుతోంది.

మరోపక్క స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న బలూచ్ ప్రజలను పాక్ ప్రభుత్వం క్రూరంగా హింసించడం, జైలులో పెట్టడం, పాక్ ఆర్మీ కిడ్నాప్ చేస్తున్న ఘటనలకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ వ్యాప్తంగా బలూచి యాక్టెహ్తి కమిటీ (బీవైసీ) శుక్రవారం భారీ నిరసనలకు పిలుపునిచ్చింది.

ఈ క్రమంలో తుర్బాట్, పంజ్‌గూర్, నొకుండి, దర్బందిన్, యక్మాచ్, చార్సర్, మష్టేల్, ఓర్మాగే, చాఘి, అమీనాబాద్, ఖరక్, కరాచీ, ఉతల్, గదాని, నుష్మి, కలాట్, మస్తుంగ్ వంటి వివిధ నగరాల్లో నిరసనలు జరిగాయి. 
Pakistan Army
Baluchistan
Baluch Liberation Army
BLA
Pakistan
Quetta
Bomb Blast
Terrorism
Baluchi Protests
India-Pakistan Tension

More Telugu News