Pakistan: మళ్లీ కవ్వించిన పాక్.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

Pakistan Resumes Firing Across Control Line
      
దాయాది దేశం పాకిస్థాన్ పదేపదే కవ్విస్తోంది. వరుసగా రెండోరోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాలపై కాల్పులు జరిపింది. పాక్ సైన్యం కాల్పులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది.

ఏప్రిల్ 25-26వ తేదీ అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడినట్టు భారత అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. పహల్గామ్ దుశ్చర్య తర్వాత పాకిస్థాన్‌పై భారత్ చర్యలు ప్రారంభించింది. దీంతో భారత్‌పై రగిలిపోతున్న పాక్.. ఇలా సరిహద్దు వెంబడి కాల్పులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.
Pakistan
India-Pakistan Border
Control Line Firing
Cross-border Firing
Ceasefire Violation
Pakistan Army
India-Pakistan Conflict
Pulwama Attack
International Border

More Telugu News