Sajjala Sreedhar Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు

AP Liquor Scam Key Accused Sajjala Sreedhar Reddy Arrested
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు
  • నేడు విజయవాడ కోర్టులో హజరుపర్చనున్న అధికారులు
  • రెండు రోజుల క్రితం ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి అరెస్టు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు.

ఈ రోజు నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలతో కెసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షా‌ను కలిసి అందించారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది. 
Sajjala Sreedhar Reddy
AP Liquor Scam
SIT
Vijayawada
Raj Kసిరెడ్డి
AP CID
Andhra Pradesh
Liquor Scandal
Corruption
TDP MP

More Telugu News