Allu Arjun: విజయ్‌ దేవరకొండ నుంచి అల్లు అర్జున్‌కు స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. 'స్వీట్‌ బ్రదర్‌' అంటూ స్పందించిన బన్నీ

Vijay Deverakondas Surprise Gift to Allu Arjun
  • ఇటీవల హైదరాబాద్‌లో తన బ్రాండ్ 'రౌడీ' స్టోర్‌ను ప్రారంభించిన విజ‌య్‌
  • ఈ సందర్భంగా బ‌న్నీకి రౌడీ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేకమైన డ్రెస్సులు
  • ఆయ‌న పిల్ల‌ల‌కు మినీ బ‌ర్గ‌ర్ల‌ను గిఫ్ట్‌గా పంపిన రౌడీ బాయ్‌
  • 'స్వీట్‌ బ్రదర్‌' అంటూ గిఫ్ట్ తాలూకు ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన‌ బ‌న్నీ
పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ కలిగిన టాలీవుడ్‌ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ. ఈ ఇద్ద‌రూ ఇప్పటికే పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ఈ ఇద్దరు స్టార్లు మ‌రోసారి వార్తల్లో నిలిచారు. విజయ్ దేవరకొండ ఇటీవల హైదరాబాద్‌లో తన బ్రాండ్ అయిన 'రౌడీ' స్టోర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బ‌న్నీకి రౌడీ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేకమైన డ్రెస్సులు, అలాగే ఆయ‌న‌ పిల్లల కోసం మినీ బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేశారు. "మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్" అంటూ స్పందించారు.

కాగా, బ‌న్నీకి రౌడీబాయ్ గిఫ్ట్ పంపించ‌డం ఇది మొదటిసారి కాదు. గతంలో 'పుష్ప 2' విడుదల సందర్భంగా కూడా 'పుష్ప' పేరుతో ప్రత్యేకమైన టీషర్టులను ఐకాన్‌స్టార్‌కు గిఫ్ట్‌గా పంపిన విషయం తెలిసిందే. వాటిని స్వీకరించిన బన్నీ అప్పట్లో కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... "నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు కృతజ్ఞతలు" అని పోస్ట్ చేశారు. దీనికి విజయ్ కూడా "లవ్ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి" అని ప్రేమపూర్వకంగా స్పందించారు. 

ఇక‌, ఈ ఇద్ద‌రు స్టార్లు త‌మ‌త‌మ భారీ ప్రాజెక్టుల‌తో ప్ర‌స్తుతం బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇటీవ‌లే ఈ ప్రాజెక్టుపై నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఓ ప్ర‌త్యేక వీడియో ద్వారా అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేసింది. 

ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా కొన‌సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో చిత్రం చేయనున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ... గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 

Allu Arjun
Vijay Deverakonda
Bunny
Surprise Gift
Rowdy Brand
Pushpa 2
Tollywood
Telugu Cinema
South Indian Cinema
Upcoming Movies

More Telugu News