AP Govt: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆ నిధుల‌ విడుద‌ల

Central Govt Releases Funds for Andhra Pradesh
  • 15వ ఆర్థిక సంఘం నిధుల‌ విడుద‌ల 
  • 2024-25 ఆర్థిక సంవత్స‌రానికి నిధుల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ
  • రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌
ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను విడుద‌ల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించిన నిధుల‌ను విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌య్యాయి. 

ఇందులో 70 శాతం గ్రామ పంచాయ‌తీల‌కు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు 20 శాతం, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు 10 శాతం చొప్పున నిధుల‌ను కేటాయించ‌నున్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఆయా గ్రామ పంచాయ‌తీల బ్యాంక్ ఖాతాల‌కు ఆర్థిక శాఖ అనుమ‌తితో పంచాయ‌తీ రాజ్ శాఖ నిధుల‌ను జ‌మ చేయ‌నుంది.   
AP Govt
Central Government
Andhra Pradesh
15th Finance Commission
Funds Released
Financial Year 2024-25
Rural Development
Panchayat Raj
Local Bodies
Government Grants
AP Budget

More Telugu News