College Student Assault: లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై చర్యలు

College Student Suspended for Assaulting Lecturer
  • కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన యాజమాన్యం
  • సెల్ ఫోన్ లాక్కుందని లెక్చరర్ పై దాడి చేసిన స్టూడెంట్
  • మనస్తాపంతో రాజీనామా చేసిన లెక్చరర్
కాలేజీ లెక్చరర్ పై విద్యార్థిని దాడి చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సెల్ ఫోన్ లాక్కుందని లెక్చరర్ ను అసభ్యంగా తిట్టడంతో పాటు చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై రఘు విద్యాసంస్థల చైర్మన్ రఘు ప్యాకల్టీతో సమావేశమై ఘటనపై చర్చించారు. 

తాజాగా దీనిపై కాలేజీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. లెక్చరర్ పై దాడికి సంబంధించిన ఘటనపై విచారణ జరిపించామని యాజమాన్యం పేర్కొంది. లేడీ ఫ్యాకల్టీపై చేయిచేసుకోవడం, తిట్టడం వంటి చర్యల కారణంగా ఈసీఈ సెకండ్ ఇయర్‌కు చెందిన వెంకటలక్ష్మీ అనే విద్యార్థిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. కాగా, విద్యార్థిని తనపై దాడి చేయడంతో మనస్తాపం చెందిన లెక్చరర్ రాజీనామా చేసినట్లు సమాచారం.
College Student Assault
Lecturer Attacked
Venkatalakshmi
Suspended Student
Raghu Educational Institutions
College Management Action
Student Misconduct
Andhra Pradesh College News
Telugu States News
Teacher Resignation

More Telugu News