Bandi Sanjay: పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు.. కేంద్రమంత్రి బండి సంజయ్

- పహల్గామ్ ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అన్న మంత్రి
- ఈ ఘటనకు ప్రతీకారంగా పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయని వ్యాఖ్య
- ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అంతా అండగా ఉండాలని పిలుపు
పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా దాయాది పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ చర్యలు ఉంటాయని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎంసీహెచ్ఆర్‌డీలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వంద మందికి నియామక పత్రాలు అందజేశారు.
ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ... పహల్గామ్ పాశవిక దాడి ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ అని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణమంత్రి అంగీకరించారని గుర్తుచేశారు. కానీ, తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ అండగా నిలివాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.