Naga Chaitanya: నాగ‌చైత‌న్య 24వ మూవీ.. ఇంట్రెస్టింగ్‌గా స్పెష‌ల్ వీడియో

Naga Chaitanyas 24th Movie Special Video Out Now
  • చైతూ, కార్తీక్ దండు కాంబోలో ఎన్‌సీ24
  • స‌రికొత్త మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా సినిమా
  • ఇప్పటికే విడుదలైన మూవీ ప్రీలుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌
  • ఇప్పుడు ఆస‌క్తిక‌ర వీడియోను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌
ఇటీవ‌ల తండేల్‌తో టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇది చైతూకు 24వ మూవీ (ఎన్‌సీ24). ఇప్ప‌టివ‌రకు తెలుగు తెర‌పై చూడ‌ని స‌రికొత్త మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు దీన్ని తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలుస్తోంది. 

ఇక‌, ఇప్పటికే విడుదలైన మూవీ ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్పెష‌ల్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఈ సినిమా కోసం వేసిన ప్ర‌త్యేక సెట్స్‌, నాగ‌చైత‌న్య లుక్‌, ఇత‌ర విష‌యాల‌ను చూపించారు. ఆస‌క్తిక‌ర ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దిన వీడియో సినిమాపై అంచ‌నాలను పెంచింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  


Naga Chaitanya
NC24
Mythological Thriller
Karthik Dandu
Telugu Cinema
Tollywood
New Movie
Special Video
Movie Updates
Ajanish Loknath

More Telugu News