Ira Khan: 27 ఏళ్లు వచ్చినా పైసా సంపాదించట్లేదని అమిర్ ఖాన్ కూతురు ఆవేదన.. హీరో ఏమన్నారంటే?

Ira Khans Emotional Struggle Amir Khans Supportive Response
  • తల్లిదండ్రులపై ఆధారపడి బతకడం పట్ల విచారం
  • 'ఆగత్సు ఫౌండేషన్' పేరుతో మానసిక ఆరోగ్య సంస్థను నడుపుతున్న ఇరా ఖాన్
  • డబ్బు సంపాదించడం కంటే ఇతరులకు సాయపడటం ముఖ్యమన్న ఆమిర్ ఖాన్
  • కూతురు చేస్తున్న పని పట్ల గర్వంగా ఉందని వ్యాఖ్య
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన మానసిక సంఘర్షణను ఇటీవల పంచుకున్నారు. 27 ఏళ్ల వయసులోనూ ఎలాంటి సంపాదన లేకపోవడం, ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తుండడంతో తానో బేకార్ (ఉపయోగంలేని) మనిషినని అనిపించిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మానసిక ఆరోగ్య సంస్థ 'ఆగత్సు'ను ప్రారంభించడానికి ముందు ఈ ఆలోచనలు తనను వెంటాడాయని ఇరా వెల్లడించారు.

ఈ విషయంపై ఆమిర్ ఖాన్ స్పందిస్తూ.. కుమార్తె ఇరాకు ఆయన అండగా నిలిచారు. "కొందరు ఇతరులకు సహాయం చేసి డబ్బు తీసుకుంటారు. మరికొందరు డబ్బు తీసుకోకుండానే సాయపడతారు. ఇతరులకు సాయం చేయడం ముఖ్యం, దానికి డబ్బు తీసుకుంటున్నావా, లేదా అన్నది వేరే విషయం. నువ్వు ప్రజలకు చేస్తున్న సహాయమే చాలు" అని ఆమిర్ స్పష్టం చేశారు.

తన కుమార్తె చేస్తున్న పని పట్ల తాను గర్వపడుతున్నానని ఆమిర్ పేర్కొన్నారు. "ఇంతమందికి నువ్వు సహాయం చేస్తుండటం ఒక తండ్రిగా నాకు చాలా గొప్ప విషయం. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావా, లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. ఇతరులకు మంచి చేస్తున్నావన్నదే నాకు ముఖ్యం" అని కుమార్తెకు భరోసా ఇచ్చారు. ఇరా ఖాన్ 'ఆగత్సు ఫౌండేషన్' ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. గతంలో ఆమిర్, ఇరా ఇద్దరూ కలిసి థెరపీ సెషన్లకు హాజరైనట్లు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.
Ira Khan
Amir Khan
Bollywood
Mental Health
Agatsu Foundation
Financial Independence
Parental Support
Therapy
Mental Struggle
Celebrities Mental Health

More Telugu News