PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీలో ట్విస్ట్

PSR Anjaneyulus Custody Twist in Harassment Case
  • స్వల్ప అస్వస్థతకు గురైన పీఎస్ఆర్
  • వైద్య పరీక్షల్లో పీఎస్ఆర్ కు హైబీపీ
  • తిరిగి జైలుకు పంపిన సీఐడీ అధికారులు
బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టైన విషయం తెలిసిందే. సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. కోర్టు పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపించింది. దీంతో అధికారులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్ ను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరగా.. మూడు రోజుల కస్టడీకి కోర్టు ఆనుమతిచ్చింది.

ఈ నేపథ్యంలో ఆదివారం పీఎస్ఆర్ ను కస్టడీలోకి తీసుకోవడానికి సీఐడీ అధికారులు విజయవాడ జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో పీఎస్ఆర్ ఆంజనేయులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో పీఎస్ఆర్ ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో పీఎస్ఆర్ హైబీపీతో బాధపడుతున్నారని వైద్యులు తేల్చారు. ఈ పరిస్థితుల్లో కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే పీఎస్ఆర్ ఇబ్బంది పడే అవకాశం ఉందని సీఐడీ అధికారులు భావించారు. విచారణ జరిపే పరిస్థితి లేదని పీఎస్ఆర్ ఆంజనేయులును తిరిగి జైలుకు తరలించారు.
PSR Anjaneyulu
AP Intelligence Chief
Kadambari Jawant
Bollywood Actress Harassment Case
CID Arrest
Vijayawada Jail
Remand
High Blood Pressure
Custodial Investigation
Andhra Pradesh

More Telugu News