Mumbai Indians: రికెల్టన్, సూర్య ఫిఫ్టీలు... ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు

Mumbai Indians Post Huge Score Against Lucknow Super Giants
  • వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
  • మొదట బ్యాటింగ్ కు దిగి 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 రన్స్ చేసిన ముంబయి
లక్నో సూపర్ జెయింట్స్ తో పోరులో ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించగా... చివర్లో నమన్ ధీర్, కోర్బిన్ బాష్ దూకుడుగా ఆడడంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు నమోదు చేసింది. రికెల్టన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 58 పరుగులు... సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ లక్నో బౌలర్లను చీల్చిచెండాడారు. 

ఓ దశలో తిలక్ వర్మ (6), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (5) తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో ముంబయి జట్టు ఇబ్బందుల్లో పడినట్టు అనిపించింది. అయితే, ఆఖరి ఓవర్లలో నమన్ ధీర్, కోర్బిన్ బాష్  బ్యాట్లు ఝళిపించడంతో ముంబయి స్కోరు 200 మార్కు దాటింది. నమన్ ధీర్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 25 (నాటౌట్) పరుగులు చేయగా, ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న బాష్ 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు చేశాడు. 

గాయంతో కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ బరిలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఫాస్ట్ పేసర్ మయాంక్ యాదవ్ పునరామగనంలో ఆకట్టుకున్నాడు. ఇవాళ ముంబయిపై 4 ఓవర్లు విసిరి 40 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మయాంక్ ధాటికి రోహిత్ శర్మ (12), హార్దిక్ పాండ్యా తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. ఇతర లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్ 2, ప్రిన్స్ యాదవ్ 1, దిగ్వేష్ రాఠీ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.
Mumbai Indians
IPL 2024
Ryan Rickelton
Suryakumar Yadav
Naman Dhir
Corbin Bosch
Lucknow Super Giants
Mayank Yadav
Rohit Sharma
Hardik Pandya

More Telugu News