Royal Challengers Bangalore: ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆర్సీబీ ఫైట్... టాస్ అప్ డేట్ ఇదిగో!

RCB vs DC Bangalore Wins Toss opts to Bowl
  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు టీమ్
  • పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్న ఢిల్లీ, బెంగళూరు జట్లు 
ఐపీఎల్ లో ఇవాళ్టి రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వెల్లడించాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ స్థానంలో జాకబ్ బెతెల్ ను జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఫాఫ్ డుప్లెసిస్ తిరిగొచ్చాడు. 

కాగా, పాయింట్ల పట్టికలో ఢిల్లీ, బెంగళూరు జట్లు వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించగా... బెంగళూరు 9 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు నమోదు చేసింది.
Royal Challengers Bangalore
Delhi Capitals
IPL 2023
RCB vs DC
Rajat Patidar
Faf du Plessis
Arun Jaitley Stadium
Cricket Match
IPL

More Telugu News