Ashrita Vemuganti: రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తెలుగు నటి

Ashrita Vemugantis Interesting Comments on Rajamouli
  • బాహుబలిలో అనుష్క వదినగా నటించిన నటి ఆశ్రిత వేమగంటి
  • బాహుబలి సినిమా సమయంలో తన వయసు 27 సంవత్సరాలేనని వెల్లడి
  • తను ప్లస్ సైజు కావడంతో రాజమౌళి బాహుబలిలో పెద్దదానిగా చూపించారన్న ఆశ్రిత
ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించి నటి ఆశ్రిత వేమగంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆశ్రిత, తన వయసుకు మించిన పాత్రలో నటించారు. బాహుబలి తర్వాత పలు చిత్రాల్లోనూ పెద్ద తరహా పాత్రల్లోనే నటిస్తూ వస్తున్న ఆశ్రిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాహుబలి సినిమా నిర్మాణ సమయంలో తన వయసు కేవలం 27 సంవత్సరాలేనని, కానీ అందులో తనను దర్శకుడు రాజమౌళి చాలా పెద్ద దానిలాగా చూపించారని అన్నారు. తాను ప్లస్ సైజులో ఉండటంతో అలా సులువుగా కనిపించేశానని చెప్పుకొచ్చారు. రాజమౌళి విజన్ చాలా బాగుంటుందని అన్నారు. ఆయన వల్లనే తనకు చాలా మంచి పేరు వచ్చిందన్నారు.

కానీ ఆ తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయన్నారు. తాను ప్లస్ సైజులో ఉండటమే ఇందుకు కారణమైందని అన్నారు. ఎక్కువగా అలాంటి పాత్రలు రావడంతో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. తన వయస్సు తక్కువే అయినప్పటికీ పెద్ద వయసు పాత్రల్లో నటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తన కంటే ఎక్కువ వయసు ఉన్న వారు అదే చిత్రంలో చిన్న వయసు పాత్రల్లో నటిస్తున్నారన్నారు.

సినిమా అన్న తర్వాత అన్ని పాత్రల్లో నటించాలని అందరూ తనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఇష్టం లేకపోయినా ఇలాంటి పాత్రల్లో నటించేందుకు ఒప్పుకుంటున్నానని తెలిపారు. తనకు బాహుబలి తర్వాత ఎంసీఏ, క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు వచ్చిందని ఆశ్రిత చెప్పారు. 
Ashrita Vemuganti
Rajamouli
Baahubali
Telugu Actress
Plus Size Actress
Telugu Cinema
Tollywood
Movie Roles
Body Image
Film Industry

More Telugu News