Salman Khan: 'బజరంగీ భాయిజాన్' సీక్వెల్‌పై విజయేంద్ర ప్రసాద్ స్పందన

Bajrangi Bhaijaan 2 Vijayendra Prasads Response on Sequel
  • సల్మాన్‌తో 'బజరంగీ భాయిజాన్' సీక్వెల్ గురించి మాట్లాడానన్న రచయిత విజయేంద్ర ప్రసాద్
  • సరిగ్గా పదేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ అందుకున్న సల్మాన్ ఖాన్ మూవీ 'బజరంగీ భాయిజాన్'
సల్మాన్ ఖాన్ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాలలో బజరంగీ భాయిజాన్ ఒకటి. ఈ సినిమా సరిగ్గా 10 ఏళ్ల క్రితం విడుదలై ఘన విజయం సాధించింది. సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ పాత్రలో అందరి దృష్టినీ ఆకర్షించగా, హర్షాలి మల్హోత్రా మున్నీ పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురావడానికి ఇప్పుడు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఈ తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ బజరంగీ భాయిజాన్ సీక్వెల్ గురించి స్పందించారు. ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్టు గురించి కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్‌ను కలిశానని, బజరంగీ భాయిజాన్ కొనసాగింపునకు సంబంధించి ఒక ఆలోచన చెప్పానన్నారు. ఆ ఆలోచన ఆయనకు నచ్చిందని, ఏమి జరుగుతుందో చూద్దామని అన్నారని తెలిపారు.

సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేశ్, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. భారతదేశానికి వచ్చి తప్పిపోయిన మున్నీ అనే పాకిస్థానీ అమ్మాయిని తిరిగి తన స్వస్థలానికి చేర్చడమే ఈ సినిమా కథాంశం. ప్రస్తుతం సల్మాన్‌కు ఒక భారీ విజయం అత్యవసరమైన నేపథ్యంలో తన బ్లాక్ బస్టర్ మూవీ (బజరంగీ భాయిజాన్)కి రెండవ భాగం తీయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బజరంగీ భాయిజాన్ -2 అధికారిక ప్రకటన కోసం సల్మాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
Salman Khan
Bajrangi Bhaijaan 2
Vijayendra Prasad
Bollywood Sequel
Kabir Khan
Rockline Venkatesh
Indian Cinema
Harshaali Malhotra
Salman Khan Movies
Box Office Hit

More Telugu News