Archibald Gracie: టైటానిక్ సర్వైవర్ రాసిన లేఖకు వేలంలో కళ్లు చెదిరే ధర .. ఎంత పలికింది అంటే..?

Titanic Survivors Letter Sells for Record Breaking Price
  • టైటానిక్ మృత్యుంజయుడు కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ లేఖకు యూకేలో బహిరంగ వేలం
  • రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్ల ధర పలికిన వైనం
  • 1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున మంచుకొండను ఢీకొని టైటానిక్ షిప్ మునక
టైటానిక్ మృత్యుంజయుడు కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ.. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్ అయింది. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో ఆ లేఖకు రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్ల ధర పలికింది.

1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ షిప్ ఒక మంచుకొండను ఢీకొని మునిగిపోగా సుమారు 1500 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడిన అతి తక్కువ మందిలో గ్రేసీ ఒకరు. ఆ విపత్తు నుంచి బయటపడినప్పటికీ అతి తక్కువ ఉష్ణోగ్రత కారణంగా, గాయాల వల్ల అనారోగ్యానికి గురై ఆ తర్వాత షుగర్ సమస్యలతో కొద్ది నెలలకే అంటే డిసెంబర్ 1912లో గ్రేసీ మరణించారు.

అయితే గ్రేసీ రచించిన 'ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్' పుస్తకంలో తాను తప్పించుకున్న విషయాలను వివరించాడు. ఈ పుస్తకంలో ఓడ మునిగిపోయిన తర్వాత మంచునీటిలో బోల్తా పడిన లైఫ్ బోట్ ఎక్కి తాను ఎలా బయటపడ్డాడో వివరించారు. 1912 ఏప్రిల్ 10న సౌతాంప్టన్ నుంచి గ్రేసీ రాసినట్లు తెలుస్తున్న లేఖకు వేలం నిర్వహించగా, రికార్డు ధరతో అమ్ముడుపోయింది. ఈ లేఖలో ‘ఇది మంచి షిప్, కానీ నేను దీనిపై తీర్పు చెప్పే ముందు నా ప్రయాణాలు ముగిసే వరకు వేచి ఉండాలి’ అని ఉంది. 
Archibald Gracie
Titanic Survivor
Titanic Letter
Auction Record
Unsinkable Ship
Historical Artifact
Rare Collectible
UK Auction

More Telugu News