Buddha Venkanna: ఒకే జైలులో పీఎస్ఆర్, వంశీ .. టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆసక్తికర ట్వీట్

PSR Vamsi in Same Jail Buddha Venkannas Interesting Tweet
  • విజయవాడ జిల్లాలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, వల్లభనేని వంశీ
  • ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత బుద్దా వెంకన్న
  • రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారంటూ ఎక్స్‌లో బుద్దా పోస్టు
వివిధ కేసుల్లో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం విదితమే. గతంలో వీరిద్దరి మధ్య వైరం ఉండేది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయి ఆరోపణలు చేసుకున్నారు.

అయితే, ఈ తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న 'ఎక్స్' వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న పీఎస్ఆర్, వంశీలను ఒకే జైలు గదిలో ఉంచాలని బుద్దా కోరారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు.

వల్లభనేని వంశీకి జైలులో ఎవరైనా తోడు కావాలని, పీఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడ ఉన్నా తన పక్కన ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కావున వీరిద్దరినీ జైలులోని ఒకే గదిలో ఉంచాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 
Buddha Venkanna
Vellabhneni Vamsi
PSR Anjaneyulu
Vijayawada Jail
TDP leader
Andhra Pradesh Politics
Jail Cellmates
Political Rivalry
X Post
Tweet

More Telugu News