Pakistan Protest London: లండన్ లో భారత హైకమిషన్ ముందు పాక్ పౌరుల నిరసన.. ఎన్ఆర్ఐలు ఏంచేశారంటే!

India Pakistan Conflict Spills Onto London Streets
  • భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న భారత సంతతి ప్రజలు
  • మన జాతీయ జెండాలు, నినాదాలతో హోరెత్తించిన వైనం
  • వెలవెలబోయిన పాక్ మద్దతుదారుల నిరసన
లండన్ వీధుల్లో భారత్ మాతా కీ జై, ఇండియా జిందాబాద్ నినాదలతో హోరెత్తాయి. మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. భారత హైకమిషన్ ముందు చేపట్టిన పాక్ పౌరుల నిరసన ప్రదర్శనను డామినేట్ చేశాయి. పాక్, భారత మద్దతుదారుల పోటాపోటీ నిరసనలతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. భారత మద్దతుదారుల సంఖ్య క్షణక్షణానికి పెరిగిపోతుండడంతో పాక్ నిరసనకారులు అక్కడి నుంచి నిష్క్రమించారు.

పహల్గామ్‌ ఉగ్రదాడిని తమ దేశానికి ముడిపెడుతూ భారత్ చేస్తున్న ఆరోపణలను లండన్ లోని పాక్ సంతతి పౌరులు ఖండించారు. భారత హైకమిషన్ ముందు ఆదివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. సుమారు యాభై, అరవై మంది పాక్ జెండాలు చేతబట్టి భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రవాస భారతీయులు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ, లౌడ్ స్పీకర్ల ద్వారా పాకిస్థానీ నిరసనకారుల గొంతును అణచివేస్తూ భారతీయ మద్దతుదారులు దేశభక్తి గీతాలు ఆలపించారు. "జై శ్రీరామ్", "వందేమాతరం", "భారత్ మాతా కీ జై" వంటి నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు, పాకిస్థానీ నిరసనకారులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసినప్పటికీ వారి సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు, వారిలో ఉత్సాహం కొరవడింది. పహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తం ఉందనడానికి ఆధారాలు లేవని, ఎన్నికల నేపథ్యంలోనే భారత్ ఆరోపణలు చేస్తోందని కొందరు పాక్ నిరసనకారులు వ్యాఖ్యానించారు. ఈ ఘటన బ్రిటన్‌లో రాజకీయ చర్చకు దారితీసింది. లండన్ వీధుల్లో విదేశీ వివాదాలు చోటుచేసుకోవడంపై కొందరు స్థానిక రాజకీయ నేతలు, వ్యాఖ్యాతలు ఆందోళన వ్యక్తం చేశారు. బహుళ సాంస్కృతిక విధానం విజయవంతమైందా అనే దానిపై చర్చ మొదలైంది. మెట్రోపాలిటన్ పోలీసులు ఇరువర్గాలను అదుపు చేయడానికి ప్రయత్నించారు.
Pakistan Protest London
India-Pakistan tensions
London Protest
Indian High Commission
NRIs
Modi
Pulwama Attack
Anti-India Protest
Pro-India Protest
International Relations

More Telugu News