Abishan Jeevinth: వేదిక‌పైనే ప్రియురాలికి ప్ర‌పోజ్ చేసిన ద‌ర్శ‌కుడు.. వీడియో ఇదిగో!

Tamil Director Abishan Jeevinth On Stage Proposal Goes Viral
    
త‌మిళ ద‌ర్శ‌కుడు అభిషన్ జీవంత్ వేదిక‌పైనే త‌న‌ ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. తాను డైరెక్ట్ చేసిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ అభిష‌న్ భావోద్వేగానికి గుర‌య్యారు. 

తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకుంటానని, ఇందుకు ఆమె ఒప్పుకోవాల‌ని ఆయ‌న ప్రపోజ్ చేశారు. ఇక‌, అభిషన్ జీవంత్ ప్రపోజ్ చూసి అఖిల కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మార‌గా... నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 
Abishan Jeevinth
Tamil Director
Viral Proposal
Movie Pre-release Event
Tourist Family Movie
Akhila
On-stage Proposal
Love Story
Couple Goals
Viral Video

More Telugu News