Allu Arjun: బీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్... వైర‌ల్ చేస్తున్న బ‌న్నీ ఫ్యాన్స్‌!

Allu Arjuns Image at BRS Rally Goes Viral
  
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ రజతోత్సవ సభలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప ఫ్లెక్సీలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈ ఫ్లెక్సీల‌తో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంద‌డి చేశాయి. 

ఓ వైపు కేసీఆర్, మ‌రోవైపు బ‌న్నీ ఫొటోల‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. "కేసీఆర్ అంటే పేరు కాదు.. కేసీఆర్ అంటే బ్రాండ్‌.. తగ్గేదేలే" అని రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను బీఆర్ఎస్ శ్రేణులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా అల్లు అర్జున్ అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు.   
Allu Arjun
Pushpa
BRS
KCR
Telangana
Elkurthi
Hanumakonda
Viral
Political Rally
Banner

More Telugu News