Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట

Supreme Court Grants Relief to YSRCP MP Mithun Reddy
  • లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిపై ఆరోపణలు
  • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి
  • ఈరోజు కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ
వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కొనసాగుతుందని తెలిపింది. 

సుప్రీంకోర్టులో ఈరోజు ఏపీ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఆ కౌంటర్ ను పరిశీలించి రీజైండర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని మిథున్ రెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Mithun Reddy
YSRCP MP
Supreme Court
Liquor Scam
AP CID
Pre-arrest Bail
Andhra Pradesh
Interim Protection
Bail Plea

More Telugu News