Manda Krishna Madiga: ఏపీ నుంచి రాజ్యసభ రేసులో మంద కృష్ణ మాదిగ, అన్నామలై, స్మృతి ఇరానీ?

AP Rajya Sabha Race Manda Krishna Madiga Annamalai Smriti Irani in the Fray
  • `విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ
  • మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగింపు
  • ఇంకా ఖరారు కాని కూటమి తరఫున అభ్యర్థి... కొనసాగుతున్న ఉత్కంఠ
  • చంద్రబాబు... మందకృష్ణ పేరు సిఫార్సు చేసినట్లు సమాచారం
  • ప్రచారంలో అన్నామలై, స్మృతి ఇరానీ పేర్లు కూడా!
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తోంది. అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీకి రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

ఈ స్థానం బీజేపీ కోటా కింద భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తూ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరును ఈ రాజ్యసభ స్థానానికి చంద్రబాబు సిఫార్సు చేసినట్లు సమాచారం.

ఈ స్థానం కోసం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు కూటమి తరఫున ఎవరు నామినేషన్ దాఖలు చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రాజ్యసభ స్థానానికి రెండేళ్ల పదవీకాలం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Manda Krishna Madiga
Annamalai
Smriti Irani
Rajya Sabha Elections
Andhra Pradesh
BJP
Nomination
AP Rajya Sabha Seat
Political News
India Politics

More Telugu News