Vaibhav Suryavanshi: వైభ‌వ్ సూర్య‌వంశీపై స‌చిన్‌, రోహిత్ ప్ర‌శంస‌లు

Vaibhav Suryavanshis Sensational IPL Century
     
గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)తో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) ప్లేయ‌ర్ 14 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్ర‌పంచంలో సెన్సేష‌న్‌గా మారిపోయాడు. 35 బంతుల్లోనే సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 11 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ 14 ఏళ్ల కుర్రాడు గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఈ ఫాస్టెస్ట్ శ‌త‌కంతో ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

జీటీపై రికార్డు సెంచ‌రీ చేసిన సూర్య‌వంశీపై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌చిన్‌, రోహిత్‌, సూర్య‌కుమార్, ష‌మీ త‌దిత‌రులు అతనిపై ప్ర‌శంస‌లు కురిపించారు. 

"వైభవ్ నిర్భయమైన విధానం, బ్యాట్‌ వేగం, ముందుగానే లెంగ్త్ ఎంచుకోవడం, బంతిని బ‌లంగా బాద‌డమే అద్భుతమైన ఇన్నింగ్స్ కు కార‌ణం. 38 బంతుల్లో 101 పరుగులు. బాగా ఆడాడు" - స‌చిన్ టెండూల్క‌ర్‌

"వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్ 'క్లాస్' "- రోహిత్ శ‌ర్మ 

"ఈ యువ‌కుడి ఇన్నింగ్స్ తో ఊచ‌కోత అంటే ఏంటో తెలిసివ‌చ్చింది. నిజంగా అద్భుత‌మైన టాలెంట్" - సూర్య‌కుమార్ యాద‌వ్ 

"వైభవ్ సూర్యవంశీ, ఎంత అద్భుతమైన ప్రతిభ. కేవలం 14 ఏళ్ల వయసులో సెంచరీ చేయడం న‌మ్మ‌లేక‌పోతున్నా. ఇలాగే కంటిన్యూ చేయండి బ్ర‌ద‌ర్‌" - మ‌హ్మ‌ద్ ష‌మీ 
Vaibhav Suryavanshi
IPL
Fastest Century
Cricket
Sachin Tendulkar
Rohit Sharma
Suryakumar Yadav
Mohammed Shami
Rajasthan Royals
Under 14 Cricket

More Telugu News