Odisha CM: ఈదురు గాలులు, భారీ వర్షాలతో ఒడిశా అతలాకుతలం.. సీఎం ఇంటి ముందు కూలిన భారీ వృక్షాలు

Odisha Faces Havoc Due to Heavy Rainfall and Strong Winds
  • ఒడిశా వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన భారీ వర్షం
  • చెట్లు, విద్యుత్తు స్తంభాలు కుప్పకూలడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం
  • జనాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఉరుములు, పిడుగులు
  • ఈదురు గాలులతో పంటలకు అపార నష్టం
భారీ వర్షాలు, ఈదురు గాలులు ఒడిశాను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారిక నివాసం వద్ద భారీ వృక్షాలు కుప్పకూలాయి. రెండు వారాలపాటు అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ఒడిశా వాసులకు ఈ వర్షం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ, ఒడిశా వ్యాప్తంగా తీవ్ర విధ్వంసం సృష్టించింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ముఖ్యమంత్రి నివాసం సమీపంలో కూలిన వృక్షాలను తొలగిస్తున్నారు. 

భారీగా వీస్తున్న ఈదురుగాలుల కారణంగా రాజధాని భువనేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో చెట్లతోపాటు విద్యుత్తు స్తంభాలు కూడా నేలకూలాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు కూలి రహదారులపై పడటంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 20 జిల్లాల ప్రజలను ఉరుములు, పిడుగులు భయభ్రాంతులకు గురిచేశాయి. ఈదురు గాలుల కారణంగా వరి వంటి పంటలు పూర్తిగా నేలకొరిగాయి. 

కియోంజర్, మయూర్‌భంజ్, భద్రక్, బాలాసోర్‌లలో గుడిసెలు, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతాలైన మయూర్‌భంజ్, కియోంజర్, అంగుల్, ధేంకనల్, బౌధ్, కంధమాల్, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి ప్రాంతాల్లో నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఐఎండీ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. 
Odisha CM
Mohapatra
Odisha Cyclone
Heavy Rainfall Odisha
Strong Winds Odisha
Bhubaneswar
Power Outage Odisha
Agricultural Damage Odisha
IMD Orange Alert
Tree Falls Odisha

More Telugu News