Anurag Reddy: లండన్‌లో ఆచూకీ లేకుండా పోయిన తెలంగాణ విద్యార్థి

Telangana Student Missing in London
  • లండన్‌లో నిజామాబాద్ జిల్లా విద్యార్ధి అదృశ్యం
  • సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం పంపిన విద్యార్ధి తల్లి హరిత 
  • విద్యార్ధి ఆచూకీ కోసం ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్‌లోని ఇండియన్ హైకమిషన్‌కు లేఖ రాసిన సీఎస్
లండన్‌లో తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. నిజామాబాద్ జిల్లా, ముప్కాల్ మండలం, రెంజర్ల గ్రామానికి చెందిన నల్ల అనురాగ్ రెడ్డి విద్యార్థి వీసాపై జనవరిలో లండన్‌కు వెళ్లాడు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. కుమారుడు అదృశ్యం కావడంతో తల్లి హరిత, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

లండన్‌లో తప్పిపోయిన తన కుమారుడి ఆచూకి తెలుసుకొని ఇండియాకు రప్పించాలని కోరుతూ హరిత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి వినతి పత్రాన్ని పంపారు. యూకేలోని కార్డిఫ్ ప్రాంతంలో ఈ నెల 25 సాయంత్రం నుంచి తన కుమారుడి జాడ తెలియకుండా పోయిందని హరిత తన వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ దీనిపై వెంటనే స్పందించారు. సీఎంఓ, జీఏడీ, ఎన్ఆర్ఐ అధికారులతో ఆయన మాట్లాడారు. దీంతో ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్‌లోని ఇండియన్ హైకమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) లేఖ రాశారు. 
Anurag Reddy
Missing Student
London
Telangana Student Missing
Indian Student UK
Cardiff
Telangana
NRI
Revanth Reddy
Anil Eeravalli

More Telugu News