KTR: కేటీఆర్ త్వరగా కోలుకోవాలి .. వైఎస్ జగన్ ట్వీట్

KTR Injury YS Jagan Wishes for Speedy Recovery
  • జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయం
  • సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన కేటీఆర్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వైఎస్ జగన్ ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాయామశాలలో కసరత్తులు చేస్తుండగా గాయపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేటీఆర్ త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ బ్రదర్ కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

కేటీఆర్ వ్యాయామశాలలో కసరత్తులు చేస్తుండగా గాయపడ్డారు. కావున కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేటీఆర్‌కు సూచించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. 
KTR
KTR injury
KTR recovery
YS Jagan Mohan Reddy
Telangana Minister
BRS Working President
AP CM
YCP
Gym injury
Telangana Politics

More Telugu News