Indravati: మనవడి వరసైన వ్యక్తిని పెళ్లాడిన 50 ఏళ్ల మహిళ.. భర్త, పిల్లలను చంపాలని ప్లాన్

Shocking Elopement Grandmother Marries Grandson Plans to Kill Husband and Children
  • ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలో ఘటన
  • ఆలయంలో పెళ్లి చేసుకుని గ్రామం నుంచి పరార్
  • ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 50 ఏళ్ల మహిళ 30 ఏళ్ల మనవడి వరసైన వ్యక్తిని పెళ్లి చేసుకుని గ్రామం నుంచి పరారైంది. అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇంద్రావతికి భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనవడి వరసైన ఆజాద్‌ను ఓ ఆలయంలో వివాహం చేసుకుని కుటుంబాన్ని వదిలి పరారైంది. 

ఇద్దరూ కలిసి తొలుత సమీపంలోని గోవింద్ సాహిబ్ ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత నుదుటికి సింధూరం దిద్దుకున్నారు. అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచారు. అనంతరం గ్రామం నుంచి పరారయ్యారు. అంబేద్కర్ నగర్‌లోని ఒకే ప్రాంతంలో ఇంద్రావతి, బంధుత్వం పరంగా మనవడు వరసయ్యే ఆజాద్ నివసించేవారు. వారి మధ్యనున్న బంధుత్వం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే, వారిమధ్యనున్న బంధుత్వం కారణంగా వారిని ఎవరూ అనుమానించలేదు. 

గ్రామం నుంచి పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వారిద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటుండగా ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ పట్టుకున్నాడు. వారిమధ్యనున్న సంబంధం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. వారిద్దరినీ వేరు చేసేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ భర్త మాటలను ఆమె పెడచెవిన పెట్టింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఇద్దరూ పెద్దలు కావడంతో అతడి ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. 

భర్త, పిల్లలకు విషమిచ్చి చంపేందుకు ఆజాద్‌లో కలిసి ఇంద్రావతి కుట్ర పన్నిన విషయం బయటకు వచ్చింది. ఇంద్రావతి తన రెండో భార్య అని ఈ సందర్భంగా చంద్రశేఖర్ తెలిపాడు. పని నిమిత్తం తాను తరచూ క్యాంపులకు వెళ్తుంటానని, దీనిని అదునుగా చేసుకుని ఇంద్రావతి, ఆజాద్ మరింత దగ్గరయ్యారని పేర్కొన్నాడు. భార్య తనను మోసం చేయడంతో తట్టుకోలేకపోతున్న చంద్రశేఖర్ హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తికి 13వ రోజున నిర్వహించే పెద్ద కర్మ తన భార్య పేరిట నిర్వహించాలని నిర్ణయించాడు. 
Indravati
Azad
Uttar Pradesh
Grandmother-Grandson Marriage
Elopement
Murder Plot
Chandrashekhar
Ambedkar Nagar
India Crime News
Family Dispute

More Telugu News