Nandamuri Balakrishna: పద్మభూషణ్ అవార్డును అందుకోవడంపై బాలకృష్ణ స్పందన

Balakrishnas Reaction to Padma Bhushan Award
  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ 
  • సరైన సమయానికే పద్మభూషణ్ పురస్కారం వచ్చిందన్న బాలయ్య
  • అభిమానులకు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా హాజరైన బాలకృష్ణ, అవార్డు స్వీకరణ అనంతరం మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ పురస్కారం అందుకోవడం పట్ల బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. తన అభిమానులకు, భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారని, అయితే తనకు సరైన సమయంలోనే పద్మభూషణ్‌ వచ్చిందని తాను భావిస్తున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. "వరుసగా నేను నటించిన నాలుగు సినిమాలు ఘన విజయం సాధించడం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తి కావడం, ముఖ్యంగా నేను సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో ఈ పురస్కారం రావడం నాకు ఎంతో ప్రత్యేకం" అని ఆయన వివరించారు. 
Nandamuri Balakrishna
Padma Bhushan Award
Indian Film Actor
Andhra Pradesh Politician
Droupadi Murmu
Delhi
Award Ceremony
Telugu Cinema
Basavatarakam Cancer Hospital
50 years in Film Industry

More Telugu News