Pawan Kalyan: అలా మాట్లాడితే... పాకిస్థాన్‌కే వెళ్లిపోండి: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

Pawan Kalyans Strong Condemnation of Terrorism
  • ప‌హ‌ల్గామ్ దాడి నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం కీల‌క వ్యాఖ్య‌లు
  • మ‌త ప్రాతిప‌దిక 26 మందిని చంపినా పాక్‌కు అనుకూలంగా మాట్లాడ‌టం స‌రికాద‌న్న ప‌వ‌న్‌
  • అలా మాట్లాడాల‌నుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాల‌న్న జ‌న‌సేనాని
  • ఉగ్ర‌వాదం, హింసపై అంద‌రూ ఒకేలా స్పందించాల‌న్న డిప్యూటీ సీఎం
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌వాద ఘ‌ట‌న నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌త ప్రాతిప‌దిక 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. అలా మాట్లాడాల‌నుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాల‌ని జ‌న‌సేనాని అన్నారు. 

ఈ ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈరోజు మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్ హాలులో జ‌న‌సేన పార్టీ నివాళుల కార్యక్ర‌మం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ... ఉగ్ర‌వాదం, హింసపై అంద‌రూ ఒకేలా స్పందించాల‌ని అన్నారు. ఇలాంటి విష‌యాల‌పై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడ‌కూడ‌ద‌ని తెలిపారు. ఉగ్రఘ‌ట‌న‌లో జ‌న‌సేన ఓ కార్య‌క‌ర్త‌ను కోల్పోయింద‌ని ప‌వ‌న్ గుర్తుచేశారు. 

ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావ‌లికి చెందిన మ‌ధుసూద‌న్‌రావు ఫ్యామిలీకి పార్టీ త‌ర‌ఫున రూ.50ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. 

"చ‌నిపోయిన మ‌ధుసూద‌న్‌రావు ఎవ‌రికి హాని చేశారు. కుటుంబాన్ని తీసుకుని క‌శ్మీర్‌కు వెళ్తే చంపేశారు. క‌శ్మీర్ మ‌న‌ది కాబ‌ట్టే అక్క‌డికి వెళ్లామ‌ని మ‌ధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్క‌టే. ఇక్క‌డ కూడా ఉండొద్దంటే ఎక్క‌డికి పోవాలి. మ‌త క‌ల‌హాలు సృష్టించేవారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండి ఎదుర్కోవాలి. యుద్ధ ప‌రిస్థితులు వ‌చ్చినా సిద్ధంగా ఉండాలి" అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.  
Pawan Kalyan
Janasena
Pakistan
Pulwama Attack
Terrorism
Kashmir
Andhra Pradesh
Deputy CM
India-Pakistan Relations
Religious Violence

More Telugu News