Somishetti Madhusudan Rao: మధుసూదన్ భార్య ఆ దాడిని వివరిస్తుంటే తట్టుకోలేకపోయాము: మంత్రి నాదెండ్ల మనోహర్

Madhusudan Raos Wifes Account of the Attack Leaves Minister Nadeendla Manohar Distraught
ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి 
కావలికి చెందిన జనసేన సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ మృతి
నేడు నివాళి కార్యక్రమం నిర్వహించిన జనసేన హైకమాండ్
పాల్గొన్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ రావుకు జనసేన అగ్రనేతలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.  మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ, పహల్గామ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సామాన్య అరటి పండ్ల వ్యాపారి కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మంచి జీవితం గడుపుతున్న మధుసూదన్ రావు ఉగ్రవాదుల దాడిలో మరణించడం అత్యంత బాధాకరమని న్నారు. దాడి జరిగిన తీరును ఆయన భార్య వివరిస్తుంటే తట్టుకోలేకపోయానని ఆవేదన చెందారు.

ఈ ఘటన జరిగిన వెంటనే పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించామని నాదెండ్ల తెలిపారు. మృతుడి ఆత్మశాంతికి వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పించామని, భారతీయుల ఐక్యతను చాటేందుకు మానవహారం కూడా నిర్వహించామని వివరించారు. పార్టీ శ్రేణులలో జాతీయవాదాన్ని పెంపొందించేలా పవన్ కల్యాణ్ పార్టీని నిర్మించారని పేర్కొన్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా దీటైన, బలమైన సమాధానం ఇస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Somishetti Madhusudan Rao
Janasena Party
Pawan Kalyan
Nadeendla Manohar
Pulwama Terrorist Attack
Jammu and Kashmir
India
Terrorism
AP Deputy CM
Political News

More Telugu News