Imran Hashmi: ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి

Bollywood Actor Imran Hashmi Warns Terrorists After Pahalgam Attack
  • పహల్గామ్ ఉగ్రదాడిపై ఇమ్రాన్ హష్మి ఫైర్
  • ఉగ్రవాదానికి మతం ఉండదని వ్యాఖ్య
  • పక్కా ప్రణాళికతో దాడి చేశారని మండిపాటు
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండిస్తున్నారు. తాజాగా, ఈ ఘటనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మి తీవ్రంగా స్పందించారు.

ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన ఇమ్రాన్ హష్మి... ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి ఎలాంటి మతం ఉండదని, దానిని ఏ మతంతోనూ ముడిపెట్టరాదని ఆయన అన్నారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడి పక్కా ప్రణాళికతో జరిగిందని అభిప్రాయపడ్డారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ విమర్శలకు దారితీసింది. పలు దేశాల అధినేతలు ఈ దాడిని ఖండించారు. మానవత్వంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు.

మరోవైపు, ఈ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. పహల్గామ్ పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాన్ని ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదుల కదలికలను ఇప్పటికే పలుమార్లు గుర్తించినప్పటికీ, వారు భద్రతా బలగాల నుంచి తృటిలో తప్పించుకున్నారని సమాచారం.
Imran Hashmi
Bollywood Actor
Terrorist Attack
Pahalgam Attack
Jammu and Kashmir
Terrorism
India
Condemnation
Security Forces
Warning to Terrorists

More Telugu News