Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ తో కేకేఆర్ ఢీ... టాస్ సమాచారం

Delhi Capitals vs KKR Toss and Match Updates
 
ఐపీఎల్ లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు ఢిల్లీ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోందని కెప్టెన్ అక్షర్ పటేల్ చెప్పాడు. మరోవైపు, కోల్ కతా జట్టులో ఒక మార్పు జరిగింది. అనుకూల్ రాయ్ తుది జట్టులోకి వచ్చాడు. 

పాయింట్ల విషయానికొస్తే... ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు నమోదు చేసింది. కేకేఆర్ ఇప్పటిదాకా 9 మ్యాచ్ ల్లో 3 విజయాలు మాత్రమే సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Delhi Capitals
KKR
IPL 2023
Axar Patel
Anukul Roy
Arun Jaitley Stadium
Delhi vs KKR
IPL Match
Cricket Match

More Telugu News