Sake Sailajanath: వైసీపీ శింగనమల నియోజకవర్గ కోఆర్డినేటర్ గా సాకే శైలజానాథ్ ను నియమించిన జగన్

Sake Sailajanath Appointed YCP Coordinator for Singanamala
  • ఈ ఏడాది ఫిబ్రవరి 7న వైసీపీలో చేరిన సీనియర్ నేత సాకే శైలజానాథ్
  • వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిక 
  • వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శైలజానాథ్
  • 2022లో పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహణ
వైసీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఆయనను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న ప్రకటించింది.

సీనియర్ నాయకుడైన సాకే శైలజానాథ్ శింగనమల రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

2022 జనవరి నుంచి అదే ఏడాది నవంబర్ వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్‌ను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్ నియమించారు. 
Sake Sailajanath
YCP
YS Jagan Mohan Reddy
Singanamala
Andhra Pradesh
Congress Party
PCC President
MLA
Assembly Elections
Andhra Pradesh Politics

More Telugu News