Simhadri Appanna Swamy: సింహాద్రి చందనోత్సవంలో ప్రమాదం .. ఏడుగురు భక్తుల మృతి

Seven Pilgrims Die in Simhadri Chandanotsavam Tragedy
  • సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి 
  • రూ.300 టికెట్ కౌంటర్ వద్ద కూలిన సిమెంట్ గోడ 
  • ఏడుగురు భక్తులు మృతి, నలుగురికి గాయాలు
  • సహాయక చర్యలు నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం
  • ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించిన హోంమంత్రి అనిత
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంటు గోడ కూలిపోయింది.

వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
Simhadri Appanna Swamy
Simhadri Chandanotsavam
Visakhapatnam
Andhra Pradesh
Wall Collapse
Temple Tragedy
Chandanotsavam Accident
Pilgrim Deaths
Home Minister Vangala Anitha

More Telugu News