Kalyanapuram Ramadurga: భర్తతో బైక్‌పై వెళ్తుతుండగా చున్నీ మెడకు చుట్టుకుని భార్య మృతి

Womans Chunni Caught in Bike Dies in Andhra Pradesh
  • అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఘటన
  • బైక్‌పై ఆసుపత్రికి వెళ్తుండగా వెనక చక్రంలో చున్నీపడి మెడకు బిగుసుకున్న వైనం
  • పెళ్లయిన 9 నెలలకే విషాదం
భర్తతో కలిసి బైక్‌పై ఆసుపత్రికి వెళుతున్న భార్య మెడకు ప్రమాదవశాత్తు చున్నీ బిగుసుకుని మరణించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కేసనకర్రుకు చెందిన కల్యాణపు రామదుర్గ (28)కు కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన విన్నకోట మోహనకృష్ణతో 9 నెలల క్రితం వివాహమైంది.

మోహనకృష్ణకు తాజాగా అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం రావడంతో అక్కడకు సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో సోమవారం రాత్రి 7 గంటల సమయంలో భర్త ఆమెను తీసుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. ఈ క్రమంలో హరిపాలెం వద్ద రామదుర్గ వేసుకున్నచున్నీ బైక్ వెనుక చక్రంలో పడి మెడకు బిగుసుకుంది. గమనించిన స్థానికులు మెడకు చుట్టుకున్న చున్నీని కత్తిరించి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kalyanapuram Ramadurga
bike accident
Ankapalle
Achyutapuram
husband
wife
death
Chunna
neck
Andhra Pradesh

More Telugu News