Pawan Kalyan: సింహాచలం ఘటన దురదృష్టకరం: డిప్యూటీ సీఎం పవన్

- సింహాచలం దుర్ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేనాని
- బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన దురదృష్టకరమన్న జనసేనాని... మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని కోరారు.
అనంతరం ఆయన ఈ ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఘటనాస్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అటు సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.