PM Modi: సింహాచలం దుర్ఘ‌ట‌న‌పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

PM Modis Condolences on Simhachalam Temple Tragedy
  • సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో అపశ్రుతి
  • మృతుల కుటుంబాలకు ప్ర‌ధాని మోదీ ప్రగాఢ సానుభూతి 
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌
  • అలాగే గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఇస్తామ‌న్న ప్ర‌ధాని
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ దుర్ఘ‌ట‌న‌పై ప్రధాని న‌రేంద్ర‌ మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల‌కు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

గాయ‌ప‌డిన వారు త్వరగా కోలుకోవాలని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్‌ కౌంటర్‌ వద్ద ఉన్న ఓ గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
PM Modi
Simhachalam Temple
Wall Collapse
Tragedy
Andhra Pradesh
Temple Accident
Seven Devotees Died
Compensation
Visakhapatnam

More Telugu News